కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రంలో వేద పండితులు ఆలయార్చకులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. ప్రత్యేక పూజ కార్యక్రమంలో ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పాల్గొని ప్రభుత్వం తరఫున మొక్కులు చెల్లించుకున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడిగా ఉంటూ అన్నదాతల కష్టాలను తొలగించాలని గణపతి చండీహోమం నిర్వహించారు. మూల విరాట్ వద్ద ప్రత్యేకంగా చతుర్షష్ఠి పూజలు చేశారు. కార్యక్రమంలో తెరాస కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: తెలంగాణ చరితలో నూతన అధ్యాయం 'కాళేశ్వరం'