దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అనేక సంక్షేమపథకాలు అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి తెలిపారు. నిర్మల్ జిల్లా ముథోల్‌లో 141 మందికి, బాసరలోని తహసీల్దార్ కార్యాలయంలో 98 లబ్దిదారులకు కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఆడపిల్ల పెళ్లి తల్లిదండ్రులకు భారం కావద్దని సీఎం కేసీఆర్ కళ్యాణలక్ష్మీ , షాదీముబారక్ పథకాలను ప్రవేశ పెట్టారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అనేక సంక్షేమపథకాలు అమలు చేస్తున్నట్లు వివరించారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు గత ప్రభుత్వాలు ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టలేక పోయాయని విమర్శించారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ముందుకు సాగుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు.