హరితహారంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నిర్మల్ జిల్లా పర్యటనలో భాగంగా పట్టణంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో, సోఫీనగర్ లోని పాలశీతలీ కేంద్రంలో మంత్రులు మొక్కలు నాటారు. పాల శీతలీకరణ కేంద్రంలో పనితీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు.
కలెక్టర్ కార్యాలయం ముందు విజయ డెయిరి పాల విక్రయ కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ, విజయ డెయిరీ ఛైర్మన్ లోకభూమారెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ ఈశ్వర్, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ రాజేందర్, ఎఫ్ఎస్సీఎస్ ఛైర్మన్ రాజేందర్, రాంకిషన్ రెడ్డి పాల్గొన్నారు.