వ్యవసాయ రంగ అభివృద్దికై రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో పనిచేస్తోందని మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం చించేలి(బి) వద్ద రూ.4 కోట్ల 80 లక్షలతో నూతనంగా నిర్మించిన విత్తన శుద్ధి కర్మాగారం, విత్తన గిడ్డంగులను ప్రారంభించారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామ పంచాయతీలకు మంజూరైన ట్రాక్టర్లను ఆయా సర్పంచులకు మంత్రులు అందజేశారు.
రైతులు పంట సాగు ప్రారంభించిన నాటి నుంచి విక్రయించే వరకు కావల్సిన సదుపాయాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని మంత్రులు వివరించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రైతు సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలు చేస్తున్నట్లు మంత్రులు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: అయేషా గోళ్లు, ఎముకలు, కేశాల పరిశీలన