ETV Bharat / state

నేడు బాసర ఆర్జీయూకేటీని సందర్శించనున్న మంత్రి కేటీఆర్ - Minister KTR Basara RGUKT tour

Minister KTR to visit Basara RGUKT: మంత్రి కేటీఆర్ నేడు బాసర ఆర్జీయూకేటీని సందర్శించనున్నారు. మరో మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి విద్యార్థులతో భేటీ కానున్నారు. అనంతరం వారితో కలిసి భోజనం చేయనున్నారు. మంత్రి కేటీఆర్​ రాకతో తమ సమస్యలన్ని పరిష్కారం అవుతాయని విద్యార్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

నేడు బాసర ఆర్జీయూకేటీని సందర్శించనున్న మంత్రి కేటీఆర్

author img

By

Published : Sep 26, 2022, 7:52 AM IST

Minister KTR to visit Basara RGUKT: విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి.. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నేడు ఆదిలాబాద్, నిర్మల్​ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్​లో జైనథ్​ మండలం దీపాయిగూడకు చేరుకుంటారు. అక్కడ మాతృవియోగంతో ఉన్న ఎమ్మెల్యే జోగురామన్నను కేటీఆర్​ పరామర్శిస్తారు. అనంతరం ఆదిలాబాద్​లోని బీజీఎన్చీ డేటా సొల్యూషన్స్​ సందర్శించి అక్కడ ఉద్యోగులతో మాట్లాడతారు. ఆ తర్వాత నిర్మల్​ బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించి విద్యార్థులతో కేటీఆర్​ భేటీ అవుతారు. ఆనంతరం వారితో కలిసి భోజనం చేయనున్నారు.

ట్రిపుల్ఐటీలో సమస్యలు పరిష్కరించాలంటూ జూన్​లో విద్యార్థులు ఆందోళనకు దిగారు. అక్కడకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మరోసారి ఇక్కడకు వచ్చినప్పుడు తప్పకుండా కేటీఆర్​ను తీసుకువస్తానని చెప్పారు. ఆ హామీ మేరకు కేటీఆర్​తో కలిసి.. సబితా ఇంద్రారెడ్డి ఆర్టీయూకేటీకి వెళ్లనున్నారు. కేటీఆర్ రాకతో తమ సమస్యలన్ని పరిష్కారం అవుతాయని విద్యార్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చూడండి..

జింఖానా గ్రౌండ్ బాధితులతో కలిసి ఉప్పల్ స్టేడియంకు వచ్చిన శ్రీనివాస్ గౌడ్

ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం.. 10 మందికి గాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.