నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటిలో విద్యార్థినిపై అధ్యపకుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డ విషయంపై రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి క్యాంపస్‌ని సందర్శించారు. ప్రధాన గేటు వద్ద ఉన్న సెక్యూరిటీని ఆరా తీశారు. అనంతరం ఆర్జీయూకేటిలోని వీసీ ఛాంబర్లో, పోలీసులు, అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం విద్యార్థినిలతో ఏర్పాటు చేసిన సమావేశంలో షీ టీంపై అవగాహన కల్పించటానికి మహిళ పోలీసు అధికారులు వస్తున్నారని తెలిపారు. గత సంవత్సర కాలంగా సంభాషణలు సీసీ ఫుటేజ్‌లు చూసి చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని ఆదేశించారు. రాబోయే రోజుల్లో వైఎస్ ఛాన్సలర్ ఆర్జీయూకేటిలో ఉండే విధంగా ప్రయత్నం చేస్తామన్నారు.
ఎవరైనా అసభ్యకరంగా మాట్లాడేందుకు ప్రయత్నించినా... అధికారులకు వెంటనే తెలపాలని విద్యార్థినిలకు మంత్రి సూచించారు. క్యాంపస్‌లో రేపటి నుంచి ఫిర్యాదుల పెట్టెలను ఏర్పాటు చేస్తామన్నారు. విద్యార్థి పేరు బయటకు రాకుండా చర్యలు తీసుకుంటారని మంత్రి హామీ ఇచ్చారు. అధ్యాపకుని మీద క్రిమినల్ కేసులు నమోదు చేశామని.... నిందితున్ని అతిత్వరలో పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.
ఇవీ చూడండి: కాళేశ్వరంలో పరుగులు పెడుతున్న గోదారమ్మ