ETV Bharat / state

భౌతికదూరం పాటించండి... కరోనాను తరిమికొట్టండి.. - భౌతికదూరం పాటించండి

కరోనా మహమ్మారి నియంత్ర‌ణ‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. అదేవిధంగా ప్రజలందరూ భౌతిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని తెలిపారు. నిర్మల్​లో ఆకస్మికంగా పర్యటించిన మంత్రి.. కాసేపు బస్సులో ప్రయాణించారు.

Minister Indrakaran Reddy toured Nirmal
భౌతికదూరం పాటించండి... కరోనాను తరిమికొట్టండి
author img

By

Published : May 20, 2020, 3:38 PM IST

నిర్మ‌ల్ ప‌ట్ట‌ణంలోని ప‌లు ప్రాంతాల్లో మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి ఆకస్మికంగా ప‌ర్య‌టించారు. వ్యాపారులు, ప్ర‌జ‌లు ప్ర‌భుత్వం సూచించిన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను పాటిస్తున్నారా లేదా అని ప‌రిశీలించారు. ప్ర‌జ‌లంతా మాస్కులు ధ‌రించాల‌ని, నిబంధ‌ల‌ను పాటించ‌ని వారిపై చ‌ట్టం ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు.

లాక్​డౌన్​ను ప్రభుత్వం నిర్దేశించిన మే 31 వరకు వ్యాపారులు, ప్ర‌జ‌లు స్వచ్ఛందంగా నిబంధ‌న‌ల‌ను పాటించి... కరోనామహమ్మారిని నిర్మూలించేందుకు దోహదపడాలని కోరారు. అనంత‌రం ఎమ్మెల్యే రేఖానాయ‌క్​తో క‌లిసి బ‌స్టాండ్ నుంచి మంచిర్యాల చౌర‌స్తా వర‌కు బ‌స్సులో ప్ర‌యాణించి... ప్ర‌యాణికుల‌తో ముచ్చ‌టించారు. మంత్రి వెంట నిర్మల్ మున్సిప‌ల్ ఛైర్మ‌న్ గండ్ర‌త్ ఈశ్వ‌ర్, జిల్లా గ్రంథాల‌య ఛైర్మ‌న్ ఎర్ర‌వోతు రాజేంద‌ర్, తదితరులు పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.