రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. నిర్మల్‌లోని కురన్నపేట శివారు ప్రాంతంలో నూతనంగా నిర్మించనున్న మున్నూరుకాపు యువజన మిత్ర మండలి సంఘ భవనానికి ఆయన భూమి పూజ చేశారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో కమ్యూనిటీ హాల్ భవనాలు నిర్మించుకునేందుకు నిధులు మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రజలంతా కలిసికట్టుగా ఉండి కుల సంఘాలను బలోపేతం చేసుకోవాలని సూచించారు. అంతకు ముందు నిర్మల్ మండలంలోని ఎల్లారెడ్డిపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన కుమురంభీం విగ్రహాన్ని ఆవిష్కరించారు. గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు.
ఇది చూడండి: నేను లంచగొండిని కాదని చెప్పుకున్నా.. సమస్యేనా