రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్ని విధాలా అండగా ఉంటుందని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని రైతు సేవా సహకార సంఘం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 12 మంది డైరెక్టర్లుగా, సంఘం అధ్యక్షులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా నూతన పాలకవర్గాన్ని మంత్రి సత్కరించారు.
ఉమ్మడి జిల్లాలో ఎక్కడా లేని విధంగా నిర్మల్ రైతు సేవా సహకార సంఘం అభివృద్ధి చెందిందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ దేశంలో లేని విధంగా రైతులకు సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. రైతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం అన్ని విధాలా ముందుంటుందని ఆయన స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:వేంకటేశ్వర ఆలయానికి భూమి పూజ చేసిన ఇంద్రకరణ్ రెడ్డి