గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తెరాస ప్రభుత్వం ఉచితంగా చేప, రొయ్య పిల్లలను పంపిణీ చేస్తోందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మత్స్యకారుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. ఈ మేరకు నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని లోకల్ వెల్మల్ గ్రామం వద్ద ఎస్సారెస్పీ జలాశయంలో 31 లక్షలు, స్వర్ణ జలాశయంలో 4.34 లక్షల రొయ్య పిల్లలను మంత్రి విడుదల చేశారు.
మత్స్యకారులకు వలలు, చేపల రవాణాకు వాహనాలు అందజేయడమే కాకుండా చేపలు అమ్ముకోవడానికి సంచార దుకాణాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఇంద్రకరణ్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో కోటి రూపాయలతో మత్స్యశాఖ భవనం, రూ. 50 లక్షలతో చేపల మార్కెట్ నిర్మిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ విజయలక్ష్మి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ నర్మద, తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'నూతన వ్యవసాయ చట్టాలతో సమూల మార్పులకు శ్రీకారం'