పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టాలని రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని దివ్యా గార్డెన్లో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సభ్యత్వం పొందిన ప్రతి కార్యకర్తకు రూ.2 లక్షల బీమా సౌకర్యం ఉంటుందన్నారు. ప్రతి కార్యకర్త పేర్లు నమోదు చేసుకోవడంతో పాటు.. గ్రామస్థులను సభ్యులుగా చేర్చేలా చూడాలన్నారు.
లక్ష్యం సాధించాలి...
అనుకున్న లక్ష్యానికి కంటే ఎక్కువ సభ్యత్వాలు నమోదు చేయాలని కార్యకర్తలను కోరారు. నమోదులో రాష్ట్రంలోనే జిల్లాను మొదటి స్థానంలో నిలపాలన్నారు. అక్కడే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సభ్యత్వాన్ని తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సభ్యత్వ నమోదు జిల్లా ఇంఛార్జ్లు లోక భూమారెడ్డి, గంగాధర్ గౌడ్, జడ్పీ చైర్మన్ కె.విజయలక్ష్మి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.