అన్ని వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని దివ్య గార్డెన్లో జడ్పీ ఛైర్మన్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్ని శాఖల అధికారులకు జడ్పీటీసీలు, ఎంపీపీలు తమ తమ పరిధిలో ఉన్న సమస్యలను వివరించారు.
3 నెలల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చలి తీవ్రత ఎక్కువున్న నేపథ్యంలో కరోనా విస్తృతమయ్యే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరూ మస్కులు ధరించి జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేక దృష్టి సారిస్తుందని మంత్రి పేర్కొన్నారు. అధిక వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, ప్రభుత్వ సూచనల మేరకు సన్నరకం వడ్లు సాగు చేశారని పేర్కొన్నారు. వర్షాల కారణంగా దోమ సోకి తీవ్రంగా నష్టపోయారని జడ్పీటీసీలు వివరించారు.
రైతులు నష్టపోయిన విషయం ప్రభుత్వం దృష్టిలో ఉందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. రైతులు పంటలు సాగుచేయాలని, వరి నాట్లు వేసేవారు సరైన సమయంలో సాగు చేయాలని సూచించారు.
ఇదీ చూడండి: ఒకే కుటుంబానికి చెందిన 11 మందికి తీవ్ర అస్వస్థత.. బాలిక మృతి