ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో తెలంగాణలో ఆలయాలకు మహర్దశ వచ్చిందని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్లోని చింతకుంటవాడ హనుమాన్ ఆలయ రెండో వార్షికోత్సవాలకు మంత్రి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ప్రత్యేక రాష్ట్రావతరణ అనంతరం అనేక నూతన ఆలయాలను నిర్మించినట్టు తెలిపారు.
నిర్మల్ నియోజకవర్గంలో ఇప్పటికే 500 ఆలయాలు నిర్మించుకున్నామని, భవిష్యత్లో మరిన్నింటిని అభివృద్ధి చేయనున్నట్టు మంత్రి తెలిపారు. ఆలయాలకు వెళితే... మనసుకు ప్రశాంతత లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ ఈశ్వర్ సాయి, దీక్షా సేవా సమితి అధ్యక్షుడు లక్కడి జగన్మోహన్ రెడ్డి, కౌన్సిలర్లు అడప విజయలక్ష్మి, గండ్రత్ రమణ, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: చంద్రగిరి ఓటర్లకు.. తిరుమల శ్రీవారి ప్రసాదం!