నిర్మల్ జిల్లాలో లాక్ డౌన్‌ను కఠినంగా అమలు చేయాలని... మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పోలీసులకు సూచించారు. జిల్లా కేంద్రంలో లాక్‌డౌన్ అమలు తీరును అధికారులతో కలిసి ఆయన పర్యవేక్షించారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ప్రభుత్వం సడలింపు ఇచ్చినందున... ఆ సమయంలో ప్రజలు అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని అన్నారు. వచ్చే వారు కచ్చితంగా కొవిడ్ నిబంధనలు పాటించాలన్నారు.
లాక్ డౌన్ నియమాలు అమలు పరచడంలో అందరూ సహకరించాలని అన్నారు. ఉదయం 10 గంటల వరకు చిరువ్యాపారులు నిబంధనలు పాటించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు తెలిపారు. లాక్ డౌన్ అమలులో భాగంగా రోడ్లపై విధులు నిర్వహిస్తున్న సిబ్బంది... వారి ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి: 'త్వరలోనే కొవిడ్ ఆస్పత్రిగా బొల్లారం జనరల్ ఆస్పత్రి'