సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశ పెట్టిందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని స్వర్ణ జలాశయంలో చేప పిల్లలను విడుదల చేశారు. రాష్ట్రంలో కులవృత్తుల వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. తెలంగాణ వచ్చాక మత్స్యకారులకు అన్నిరకాలుగా ప్రయోజనం జరిగిందని, మత్స్యకారుల జీవితాల్లో కేసీఆర్ వెలుగులు నింపారని తెలియజేశారు. ప్రాజెక్టులు చేపలతో గలగలలాడుతూ గంగపుత్రుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయన్నారు. మత్స్య సంపద పెరిగి గంగపుత్రులకు ఏడాది పొడవునా ఉపాధి లభిస్తుందన్నారు.
ముఖ్యంగా వారికి కావలసినటువంటి మోపెడ్లు, వలలు, వాహనాలు, చేప పిల్లలు, ఐస్ బాక్సులు తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందన్నారు. మత్స్య రంగంపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న లక్షలాది కుటుంబాలు ఎంతో ఆనందంగా ఉన్నాయని తెలిపారు. ఈ సంవత్సరం రాష్ట్రంలో 81 కోట్ల చేప పిల్లలను విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇవీ చూడండి: 'పరిసరాల పరిశుభ్రతలో అందరూ భాగస్వాములు కావాలి'