ETV Bharat / state

Indrakaran Reddy: నిత్యావసర సరకులు పంపిణీ చేసిన మంత్రి - మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి తాజా వార్తలు

మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి(Indrakaran Reddy) నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో స్ఫూర్తి, గ్రామీణ సపోర్ట్ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ఉపాధి కోల్పోయిన వారికి ఫౌండేషన్​ సభ్యులు నరేశ్​, ప్రవీణ్​ సాయం చేయడం గొప్ప విషయమన్నారు.

Indrakaran Reddy: నిత్యావసర సరకులు పంపిణీ చేసిన మంత్రి

author img

By

Published : Jun 10, 2021, 3:07 PM IST

నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో స్ఫూర్తి, గ్రామీణ సపోర్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 135 మంది అర్చకులు, ప్రైవేట్ టీచర్లకు మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి(Indrakaran Reddy) నిత్యావసర సరకులు అందించారు. లాక్​డౌన్​తో ఉపాధి కోల్పోయిన అర్చకులు, ఉపాధ్యాయులకు ఫౌండేషన్ సభ్యులు నరేశ్​, డాక్టర్ ప్రవీణ్ సాయం చేయడం అభినందనీయమన్నారు.

ప్రభుత్వం కూడా ప్రైవేట్ ఉపాధ్యాయులను ఆదుకుందన్నారు. సాఫ్ట్​వేర్ ఉద్యోగి నరేశ్​ హైదరాబాద్​లో ఉద్యోగం చేస్తూ నెలకు తనకు తోచినంత సహాయం చేయడంతో అతన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్, తెరాస రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ గౌడ్ పాల్గొన్నారు.

ఇదీ చదవండి: Black Fungus: వ్యాధికి చికిత్స ఉందా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.