రాష్ట్రంలో.. దేవాలయాలు అభివృద్ధికి నోచుకున్నాయని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం అడెల్లి తండాలో నూతనంగా నిర్మించిన దక్షిణ ముఖ ఆంజనేయ స్వామి ఆలయ ప్రారంభోత్సవానికి ఆయన హాజరయ్యారు. సొంత నిధులతో ఆలయాన్ని నిర్మించిన సర్పంచ్ సుచరితను.. మంత్రి అభినందించారు.
నియోజకవర్గంలో.. సుమారు 500 ఆలయాల వరకు అభివృద్ధి చేశామని మంత్రి వివరించారు. కరోనా మహమ్మరిని తరిమికొట్టాలంటే ప్రతి ఒక్కరు టీకాలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మైపాల్ రెడ్డి, ఆలయ ఛైర్మన్ చందు, తెరాస మండల కన్వీనర్ మాధవరావు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'అధిక ధరలు వసూల్ చేసే డయాగ్నోస్టిక్ సెంటర్లపై చర్యలు'