ETV Bharat / state

పర్యావరణాన్ని కాపాడుకోకపోతే గాలి, నీరు దొరకదు: ఇంద్రకరణ్

పర్యావరణాన్ని కాపాడుకావడానికి ఇదే సరైన సమయమని... లేదంటే భవిష్యత్​లో గాలి, నీరు దొరకని పరిస్థితి ఏర్పడుతుందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హెచ్చరించారు. అంత‌ర్జాతీయ అట‌వీ దినోత్స‌వం సంద‌ర్భంగా ప్రకృతితో మన సంబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని తెలిపారు.

minister-indrakaran-reddy-about-environment-in-nirmal
పర్యావరణాన్ని కాపాడుకోకపోతే గాలి, నీరు దొరకదు: ఇంద్రకరణ్
author img

By

Published : Mar 21, 2021, 2:53 PM IST

ప్రకృతికి మన అవసరం కన్నా.. మనకే ప్రకృతి ఎక్కువ అవసరమని అందరూ గ్రహించాల్సిన అవ‌స‌రం ఉందని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. అంత‌ర్జాతీయ అట‌వీ దినోత్స‌వం సంద‌ర్భంగా ప్రకృతితో మన సంబంధాన్ని నిర్మల్​లో జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా ఆయన గుర్తు చేసుకున్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ఇదే సరైన సమయమని... లేదంటే భ‌విష్య‌త్తులో గాలి, నీరు దొర‌క‌ని ప‌రిస్థుతుల‌ు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

మనల్ని మనం ర‌క్షించుకోవడానికి భూమిని కాపాడుకోవాలని సూచించారు. పర్యావరణం బాగుండాలంటే గాలి, నీరు, చెట్లు సమృద్ధిగా ఉండాల‌ని అభిప్రాయపడ్డారు. భూమిపై కనీసం 33శాతం అటవీ ప్రాంతం ఉంటేనే ప‌ర్యావ‌ర‌ణ స‌మ‌తుల్య‌త సాధ్య‌మ‌వుతుంద‌ని, అందుకే రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు అధిక ప్రాధన్య‌త‌నిస్తుంద‌న్నారు. గ్రామాల్లో హరితహారంలో భాగంగా మొక్కలు నాటి వాటిని కాపాడేందుకు తగిన సదుపాయాలను ఏర్పాటు చేసిందని వివరించారు.

ఇదీ చదవండి: తిరుమలలోని విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తి అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.