నిర్మల్ జిల్లా కేంద్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడమే ధ్యేయమని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. పట్టణ సుందరీకరణలో భాగంగా స్థానిక కంచరోని చెరువు వద్ద రూ.10 లక్షల నిధులతో కట్టకి ఇరువైపులా ఏర్పాటు చేసిన లైటింగ్ సిస్టమ్‌ను మంత్రి ప్రారంభించారు. చెరువులో బోటింగ్ సౌకర్యం ఏర్పాటు చేయడంతో పాటు శ్యామ్ ఘడ్ కోటను పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు.
పట్టణంలో వాటర్ ఫౌంటెయిన్లు, స్వాగత తోరణాల నిర్మాణంతో పాటు, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు. అన్ని రకాల అభివృద్ధి పనులతో మహానగరాలను తలపించే విధంగా నిర్మల్ పట్టణం రూపుదిద్దుకుంటుందని మంత్రి అన్నారు.
ఈదిగం చౌరస్తా నుంచి శివాజీ చౌక్ వరకు రూ.3 కోట్ల వ్యయంతో రహదారి మరమ్మతు పనులు ప్రారంభించామని ఇంద్రకరణ్ తెలిపారు.
ఇదీ చదవండి: ఈనెల 29న ధరణి పోర్టల్ ప్రారంభం