ETV Bharat / state

'ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి' - nirmal latest updtes

నిర్మల్ జిల్లా న్యూ సాంగ్వి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. రైతులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అన్నదాతలకు ఇబ్బంది లేకుండా గ్రామాలకు వెళ్లి కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు తెలిపారు. మద్దతు ధరకే మొత్తం ధాన్యాన్ని సేకరిస్తామని వెల్లడించారు.

minister indrakaran inaugurated grain purchase centres in nirmal district
'ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి'
author img

By

Published : Nov 1, 2020, 2:31 PM IST

రైతులకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కోరారు. నిర్మల్ జిల్లా మామడ మండలం న్యూ సాంగ్వి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అన్నదాతలకు అవ‌స‌ర‌మైన సాగు నీటిని సీఎం కేసీఆర్ అందిస్తున్నారని... 24 గంట‌ల పాటు కోత‌ల్లేని నాణ్య‌మైన క‌రెంటుని ఇస్తున్నారని తెలిపారు.

రైతు కోసమే...

మార్కెట్‌ యార్డ్‌కు వెళ్లి తమ ధాన్యాన్ని విక్రయించుకోవడం రైతుకు ఇబ్బంది అవుతుంది కాబట్టే గ్రామాల్లోనే ధాన్యాన్ని కొనుగోలు చేయాల‌ని సీఎం కేసీఆర్ ఆదేశించారని పేర్కొన్నారు. అన్నదాతలకు ఇబ్బంది లేకుండా మద్దతు ధరకు వరి ధాన్యం సేకరించడం జరుగుతుందన్నారు.

ఏ గ్రేడ్‌కు రూ.1,888, బీ గ్రేడ్‌కు రూ.1,868 ధరను ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారానే తమ ధాన్యాన్ని అమ్ముకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: అతడు ముగ్గు వేస్తే ఫొటో తీసినట్టే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.