సీఎం కేసీఆర్(Cm Kcr).. పల్లె, పట్టణ ప్రగతి పనులపై(Rural and urban development works) ఆకస్మిక తనిఖీలు చేపడతారని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి(Minister Indrakaran) తెలిపారు. పనులు మంచిగా ఉంటే ప్రశంసలు ఉంటాయంటూ.. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులు, ప్రజాప్రతినిధులపై వేటు తప్పదని హెచ్చరించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రగతి పనులతో పాటు హరితహారం(Haritha Haaram) కార్యక్రమానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. మంగళవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పనులపై అంశాల వారీగా అధికారులకు దిశానిర్ధేశం చేశారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామ పంచాయతీలకు ప్రతి నెల నిధులు విడుదల చేస్తున్నాం. అధికారులు ప్రజల భాగస్వామ్యంతో గ్రామాలు, మున్సిపాలిటీలు పచ్చదనంతో పాటు పరిశుభ్రంగా ఉండేలా కృషి చేయాలి. ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన చట్టాలను పక్కాగా అమలు చేయాలి. పల్లె, పట్టణ ప్రగతి పనుల అమలుకు ప్రత్యేకంగా అదనపు కలెక్టర్లను నియమించాం. పంచాయతీ రాజ్ శాఖలో ఖాళీ పోస్టులను భర్తీ చేశాం. అధికారులు దీన్ని ఓ అవకాశంగా భావించాలి. గ్రామాల అభివృద్ధికి కలిసి కట్టుగా కృషి చేసి.. జిల్లాకు మంచి పేరు తీసుకురావాలి.
- మంత్రి ఇంద్రకరణ్, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి.
ముఖ్యమంత్రి ఆకస్మిక తనిఖీలను దృష్టిలో పెట్టుకుని.. గ్రామీణ, పట్టణాభివృద్ధి శాఖ అధికారులు, సర్పంచులు, కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు సమష్టిగా పని చేయాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్ పర్సన్ విజయలక్ష్మి, మున్సిపల్ ఛైర్మన్ ఈశ్వర్, ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: Minister Gangula: సీఎం.. కరీంనగర్ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు