ETV Bharat / state

నిర్మల్​లో త్వరలో పర్యటించనున్న సీఎం కేసీఆర్: మంత్రి ఇంద్రకరణ్ - తెలంగాణ వార్తలు

నిర్మల్ జిల్లా కొండాపూర్ గ్రామంలోని తెరాస పార్టీ కార్యాలయాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. తెలంగాణ భవన్ పనులపై ఆరా తీశారు. జిల్లాలో సీఎం కేసీఆర్ త్వరలో పర్యటించనున్నట్లు తెలిపారు.

minister indrakaran announce cm kcr visit nirmal district soon and review on telangana bhavan at kondapur
నిర్మల్​లో త్వరలో పర్యటించనున్న సీఎం కేసీఆర్: మంత్రి ఇంద్రకరణ్
author img

By

Published : Jan 22, 2021, 8:25 AM IST

నిర్మల్ జిల్లాలో త్వరలో పర్యటించనున్న సీఎం కేసీఆర్... తెలంగాణ భవన్ ప్రారంభోత్సవంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. నిర్మల్ జిల్లా కొండాపూర్ గ్రామంలోని తెరాస పార్టీ కార్యాలయాన్ని గురువారం సాయంత్రం పరిశీలించారు. పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. భవనం ఆవరణలో మొక్కలు నాటాలని ఆదేశించారు.

తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు అనువైన ప్రదేశం చూసి విగ్రహం ఏర్పాటు చేయాలని కాంట్రాక్టర్​కు సూచించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ మున్సిపల్ ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్, ఎఫ్ఎస్సీఎస్ ఛైర్మన్ ధర్మాజి రాజేందర్, జడ్పీ కో ఆప్షన్ డాక్టర్ సుభాశ్ రావు, కొండాపూర్ సర్పంచ్ గంగాధర్, మాజీ డీసీసీబీ ఛైర్మన్ రాంకిషన్ రెడ్డి, మండల కన్వీనర్ గోవర్ధన్ రెడ్డి, నాయకులు గండ్రత్ రమేశ్, దేవేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: టీసీ లొల్లి... కరోనా వేళ ప్రైవేటు నుంచి ప్రభుత్వ పాఠశాలలకు బదిలీ!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.