ETV Bharat / state

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి - Nirmal district news

తెలంగాణ ప్రభుత్వం రైతుల అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తోందని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

State Forest Minister Allola Indrakaran Reddy
రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
author img

By

Published : Nov 17, 2020, 2:25 PM IST

రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ సర్కార్ అనేక పథకాలు ప్రవేశపెట్టిందని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్య, వైద్యం, వ్యవసాయం వంటి 24 అంశాలపై చర్చించారు.

రైతు వేదిక భవన నిర్మాణాల్లో రాష్ట్రంలోనే నిర్మల్ జిల్లా రెండో స్థానంలో నిలిచిందని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో జడ్పీ ఛైర్​పర్సన్ విజయలక్ష్మి, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.