ETV Bharat / state

ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి: ఇంద్రకరణ్ రెడ్డి - నిర్మల్​ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

రైతులకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం ఆలూర్​లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి: ఇంద్రకరణ్ రెడ్డి

author img

By

Published : Nov 4, 2020, 3:38 PM IST

రాష్ట్రంలో వ్యవసాయరంగ అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్​ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి అన్నారు. నిర్మల్​ జిల్లా సారంగాపూర్​ మండలం ఆలూర్​లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. వ్యవసాయానికి అవసరమైన సాగునీరు, నిరంతర విద్యుత్​ అందించడమే కాకుండా... గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు.

రైతుల‌ు నష్టపోకుండా మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నామన్నారు. ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.1,888, బీ గ్రేడ్​కు రూ.1,868 మద్దతు ధరను ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారానే పంటను అమ్ముకోవాలని సూచించారు.

ఇదీ చూడండి: 'గిట్టుబాటు ధర కల్పించి... ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.