జల్, జంగల్, జమీన్ కోసం పోరాటం చేసిన యోధుడు కుమురం భీమ్ అని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కొనియాడారు. నిర్మల్ రూరల్ మండలం ఎల్లపల్లిలో కుమురం భీమ్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. మంత్రికి గ్రామస్థులు ఘనంగా స్వాగతం పలికారు.
ఆదివాసుల కోసం కుమురంభీం ఎన్నో పోరాటాలు చేశారని, వారి త్యాగ ఫలితంగానే ఆదివాసీలకు ఎన్నో సౌకర్యాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత రూ. 25 కోట్లతో కుమురం భీమ్ పేరిట మ్యూజియం ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై భీమ్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రానున్న రోజుల్లో ప్రతి మండల కేంద్రంలో ఆ మహనీయుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని తెలిపారు.
ఇదీ చూడండి: ఓటుకు నోటు కేసులో కోర్టుకు హాజరైన రేవంత్‌రెడ్డి