శిశు మరణాల రేటును తగ్గించి ఆరోగ్యవంతమైన సమాజం నిర్మించాలన్న సంకల్పంతో ప్రభుత్వం రోటా వైరస్ వ్యాక్సిన్‌ను ప్రవేశపెట్టిందని రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో రోటా వైరస్ వ్యాక్సిన్‌ను చిన్నారులకు వేశారు. అప్పుడే పుట్టిన శిశువు నుంచి సంవత్సరంలోపు చిన్నారులకు రోటా వైరస్ వ్యాక్సిన్ అందించడం వల్ల డయేరియాతో వచ్చే మరణాలు అరికట్టవచ్చని తెలిపారు. ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఇవీ చూడండి: 'ఆ ఊరిలో మద్యం విక్రయం నిషేధం'