ETV Bharat / state

'నిర్మల్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నాం' - మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తాజా వార్తలు

నిర్మల్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. పట్టణంలోని మంచిర్యాల చౌరస్తాలో రూ.5.20 కోట్లతో చేపడుతోన్న 1.6 కిలోమీటర్ల రహదారి అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

minister allola says We strive to develop Nirmal in all fields
'నిర్మల్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నాం'
author img

By

Published : Mar 5, 2021, 10:01 AM IST

పట్టణ ప్రగతిలో భాగంగా నిర్మల్‌ పట్టణంలోని శివాజి చౌక్ నుంచి అంబేడ్కర్ చౌక్ వరకు రూ.5కోట్ల 20లక్షలతో 1.6కిలోమీటర్ల రహదారి అభివృద్ధి పనులు చేపడుతున్నామని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. ఈ పనుల్లో భాగంగా రెండు వైపులా పాదచారుల మార్గం, సమాంతర పార్కింగ్, గ్రీన్ జోన్, మరుగుదొడ్లు, బస్ షెల్టర్లు తదితర నిర్మాణాలతో పట్టణ రూపురేఖలు మారనున్నాయని ఆయన వివరించారు.

పట్టణ ప్రగతిలో చేపడుతున్న రహదారి అభివృద్ధి పనులను ఆరు నెలల్లో పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామని నిర్మల్‌ జిల్లా కలెక్టర్‌ ముషర్రఫ్ ఫారూఖీ తెలిపారు. రాష్ట్రంలోనే నిర్మల్ మున్సిపాలిటీని ముందు వరుసలో నిలిపేలా మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్‌ కొరిపెల్లి విజయలక్ష్మి, మున్సిపల్ ఛైర్మన్‌ గండ్ర ఈశ్వర్, స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ఇధీ చదవండి: పట్టభద్రుల పోరులో అభ్యర్థుల ఓట్ల వేట

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.