ETV Bharat / state

స్వరాష్ట్రంలో ఆలయాలకు మహర్దశ: ఇంద్రకరణ్​ రెడ్డి

నిర్మల్​ జిల్లా సోన్​ మండలం గంజాల్​లో నిర్మించిన శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయాన్ని మంత్రి అల్లోల ఇంద్రకరణ్​ రెడ్డి ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను అలవరచుకోవాలని సూచించారు.

minister allola indrakaran reddy inaugurate sri sathyanarayana swamy temple in ganjal
స్వరాష్ట్రంలో ఆలయాలకు మహర్దశ: ఇంద్రకరణ్​ రెడ్డి
author img

By

Published : Dec 19, 2020, 7:03 PM IST

ప్రత్యేక రాష్ట్ర ఆవిర్బావం తర్వాత ఆలయాలకు మహర్దశ వచ్చిందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్​ జిల్లా సోన్​ మండలం గంజాల్​లో నూతనంగా నిర్మించిన శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయాన్ని ప్రారంభించారు. ఆలయ ప్రతిష్ఠాపనకు ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రికి వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

జిల్లాలో సత్యనారాయణ స్వామి మొదటి ఆలయాన్ని గంజాల్​ నిర్మించడం సంతోషకరంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను అలవరుచుకోవాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్​పర్సన్​ విజయలక్ష్మి, మార్కెట్​ కమిటీ ఛైర్మన్​ నర్మద, ఎంపీటీసీ సభ్యులు రాజేశ్వర్​, వీడీసీ సభ్యులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: రైతులను సంఘటితం చేసేందుకే రైతువేదికలు: నిరంజన్ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.