ETV Bharat / state

Minister inrdrakaran reddy: విద్యుత్ సమస్యలు రాకుండా చూడటమే మా లక్ష్యం: ఇంద్ర కరణ్ రెడ్డి

author img

By

Published : Jun 2, 2021, 2:30 PM IST

నిర్మల్ జిల్లాలోని రాచాపూర్ గ్రామంలో కోటి 30 లక్షలతో నిర్మిస్తున్న 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి మంత్రి అల్లోల ఇంద్ర కరణ్ రెడ్డి భూమి పూజ చేశారు.

minister allola indra karan reddy started power sub station construction in nirmal
విద్యుత్ సమస్యలు రాకుండా చూడటమే మా లక్ష్యం: ఇంద్ర కరణ్ రెడ్డి

విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం రాచాపూర్ గ్రామంలో కోటి 30 లక్షల రూపాయలతో నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్​కు ఆయన భూమి పూజ చేశారు. ఇప్పటి వరకు నిర్మల్ నియోజకవర్గంలో మొత్తం 84 విద్యుత్ సబ్ స్టేషన్​లను నిర్మించుకున్నామని మంత్రి తెలిపారు. గతంలో నియోజకవర్గంలో కరెంటు కష్టాలు ఉండేవని గుర్తు చేశారు. బొప్పారంలో 1200 కోట్ల రూపాయలతో నిర్మిచిన సబ్ స్టేషన్​తో ఆ కష్టాలు తొలగిపోయాయాని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కరెంటు కష్టాలు పోయాయని, రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒకటేనని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కేశం లక్ష్మి, మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ నర్మద, డీసీసీబీ వైస్ చైర్మన్ రఘునందన్ రెడ్డి, జడ్పీటీసీ రాజేశ్వర్, విద్యుత్ శాఖ ఎస్ఈ జయవంత్ చౌహన్, ఎంపీడీఓ మోహన్, తహశీల్దార్ కవిత రెడ్డి, తెరాస పార్టీ మండల ఇన్​ఛార్జీ సురేందర్ రెడ్డి, మండల కన్వీనర్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి : భూముల సమగ్ర సర్వేపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.