జేబులు కొట్టడం, డ్రగ్స్ అమ్మడం కూడా కొందరు స్కిల్స్ అనుకునే ప్రమాదం ఉంది : సీఎం రేవంత్ - Revanth Satirical Comments On BRS
🎬 Watch Now: Feature Video
Published : Sep 25, 2024, 5:35 PM IST
CM Revanth Satirical Comments On BRS Party : గొలుసు దొంగతనాలు, జేబులు కొట్టడం, డ్రగ్స్ అమ్మడం కూడా కొందరు స్కిల్స్ అనుకునే ప్రమాదం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. గత పాలకుల్లో కొందరికి అలాంటి నైపుణ్యాలే ఉన్నాయన్న సీఎం, వారు వాటిని కూడా స్కిల్స్ అనుకునే అవకాశం ఉందని ఎద్దేవా చేశారు. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్యూరెన్స్ రంగాల్లో ఉద్యోగాల కోసం అవసరమైన నైపుణ్య శిక్షణ అందించే మినీ డిగ్రీ కోర్సులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇవాళ హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్‌లో ప్రారంభించారు.
ఈ క్రమంలో మాట్లాడిన సీఎం, బీఆర్ఎస్ పేరు చెప్పకుండానే పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వృద్ధాప్య పెన్షన్, షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి వంటి పథకాలు ఎరైనా అమలు చేస్తారని, అందులో కొత్తదనం ఏముందన్నారు. సంక్షేమ పథకాలు అవసరమే అన్న సీఎం రేవంత్ రెడ్డి, వాటితోపాటు యువతకు నైపుణ్య శిక్షణ, ఉద్యోగ కల్పనపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. పదేళ్లు అధికారంలో ఉన్నవారు నిరుద్యోగ సమస్యను తీర్చలేకపోయారని, ఇప్పుడు ఆ బాధ్యతను తాము తీసుకున్నామన్నారు.