నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కరోనా ప్రత్యేక అధికారి డాక్టర్ కార్తీక్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. కార్యాలయ అధికారులకు, సిబ్బందికి బీపీ, షుగర్, టీబీ, కరోనా చికిత్సల కోసం నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు కార్యాలయ అధికారులకు రెవెన్యూ సిబ్బందికి ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డీఆర్వో రమేశ్ రాఠోడ్ తెలిపారు. మొత్తం 48 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఒకరికి మాత్రమే కరోనా పాజిటివ్ నిర్ధరణ అయిందన్నారు.
దశలవారీగా అన్ని ప్రభుత్వ కార్యాలయ ఉద్యోగులకు కొవిడ్ పరీక్షలు చేస్తామని డీఆర్వో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి కరీం, పర్యవేక్షకులు రహీమ్ ఉద్దీన్ హిమబిందు, నదీం, అధికారులు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: హైదరాబాద్లో విద్వేషాలు రెచ్చగొట్టే కుట్ర.. సహించం: కేటీఆర్