నిర్మల్ జిల్లా ముజ్గిలోని మల్లన్న జాతర వైభవంగా జరిగింది. జాతర ఐదురోజుల్లో భాగంగా ఆఖరి రోజున స్వామివారి రథోత్సవ కార్యక్రమాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. మల్లన్నను దర్శించుకునేందుకు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల నుంచే కాకుండా కర్ణాటక ప్రాంతం నుంచి భక్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
స్వామి వారికి పాడి పంటలు సమర్పించుకుని భక్తలు తమ మొక్కులు చెల్లించుకున్నారు. మల్లన నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.