అనుమతులు లేకుండా లక్కీడ్రా నిర్వహిస్తున్న ముఠాను సారంగాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం మహబూబ్‌ఘాట్ సమీపంలో లక్కీడ్రా నిర్వహిస్తున్నారన్న సమాచారంతో సారంగాపూర్ ఎస్సై రాం నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు.
ఆదిలాబాద్‌కు చెందిన గోల్కొండ ఆశిష్, సింగారి క్రాంతిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గరు ఘటనా స్థలం నుంచి పరారైనట్లు వివరించారు. నిందితుల నుంచి రూ. లక్షా 95 వేల నగదు, కారు, లక్కీడ్రాకు సంబంధించిన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గ్రామీణ సీఐ శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.