Maheshwar Reddy Strike on Nirmal master plan : రైతుల భూములతో వ్యాపారం చేయడానికే నిర్మల్ జిల్లాలో జీవో నెం.220ను ప్రభుత్వం తీసుకొచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఏ అధికారులైతే ఈ జీవో తీసుకొచ్చారో.. వారితోనే జీవోను రద్దు చేయించే బాధ్యత బీజేపీ తీసుకుంటుందని కిషన్‌రెడ్డి అన్నారు. నిర్మల్ మాస్టర్ ప్లాన్ ప్రణాళిక రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి చేస్తోన్న దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు. మహేశ్వర్ రెడ్డికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.
Kishan Reddy on Nirmal master plan : జిల్లాలో ప్రజాసమస్యలపై పోరాడాల్సిన అవసరం ఉందని కిషన్‌రెడ్డి సూచించారు. అనంతరం పోలీసుల లాఠీ చార్జ్‌లో దెబ్బతిన్న కార్యకర్తలను పరామర్శించారు. వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వ్యతిరేకంగా పోరాడిన ఇక్కడి బీజేపీ శ్రేణులు తెలంగాణకు ఆదర్శం అన్నారు. మంత్రి, ఆయన కుటుంబ సభ్యుల పేరిట నిర్మల్‌లో భూ కబ్జాలకు పాల్పడుతున్నాడని కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. అనంతరం మాట్లాడిన కిషన్‌రెడ్డి.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
Kishan reddy fires on KCR : ధరణి (Dharani) పేరుతో తెలంగాణ ప్రభుత్వం పేద రైతుల భూములను దోసుకొందని ఆరోపించారు. ధరణి పోర్టల్ రైతులకు గుదిబండగా మారిందన్నారు. ధరణి వలన నష్టపోయిన రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనన్నారు. మజ్లిస్ పార్టీ చేతిలోనే కేసీఆర్ కీలుబొమ్మలా మారారని ఎద్దేవా చేశారు. నిర్మల్‌లో 260 ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారులు ఏ హక్కుతో మంత్రి, కుటుంబ సభ్యుల పేరు మీద ప్రభుత్వం అప్పగించిందని ప్రశ్నించారు. బడా వ్యాపారుల కోసమే కేసీఆర్ ప్రభుత్వం భూములను వేలం వేస్తోందని మండిపడ్డారు.
గత ఎన్నికల హామీల్లో ఇచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్‌ప్లాన్ (BC Subplan) నిధులు, నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్ రూం ఇళ్లు (Double Bedroom Houses) ఇప్పటి వరకు నెరవేర్చలేదని ఆరోపించారు. మోసపూరిత హామీలు ఇచ్చిన కేసీఆర్‌కు వచ్చే ఎన్నికలలో ప్రజలే బుద్ధి చెప్పాలని సూచించారు. ఈనెల 27వ తేదీన ఖమ్మం రైతు భరోసా ఉంటుందని.. దానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా వస్తారని ప్రకటించారు. సభకు పెద్ద ఎత్తున అభిమానులు, రైతులు హాజరుకావాలని విజ్జప్తి చేశారు. అమర వీరులు కోమురం భీం, రాంజీ గోండు పోరాట స్పూర్తితో రాబోయే రోజుల్లో నిర్మల్ జిల్లాలో బీజేపీ జెండా ఎగుర వేయాలని కార్యకర్తలకు సూచించారు.
BRS MLAs Final Candidates List 2023 : బీఆర్ఎస్ గెలుపు గుర్రాలివే.. తొలి జాబితా ప్రకటించిన కేసీఆర్!
Revanth Reddy on BRS Candidates List : 'కేసీఆర్ స్వరంలో ఓటమి భయం స్పష్టంగా కనిపించింది'