ETV Bharat / state

KCR visit Nirmal district : జూన్ 4న‌ కేసీఆర్.. నిర్మల్​ జిల్లా పర్యటన - kcr

KCR inaugurated new district collectarate in Nirmal : నిర్మల్ జిల్లాలో సీఎం కేసీఆర్​ పర్యటన ఖరారైంది. జూన్​ 4న కేసీఆర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఆరోజు ముందుగా నిర్మల్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని, బీఆర్​ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. ఎల్ల‌పల్లి శివారు క్ర‌ష‌ర్ రోడ్ వద్ద జరిగే బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి పరిశీలించారు.

KCR
KCR
author img

By

Published : May 28, 2023, 4:50 PM IST

Updated : May 28, 2023, 5:05 PM IST

జూన్ 4న‌ కేసీఆర్.. నిర్మల్​ జిల్లా పర్యటన

new district collectarates in telangana : తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్​ నిర్మల్​ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటలో భాగంగా​ నిర్మల్​ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయం, బీఆర్‌ఎస్‌ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. జిల్లాకు వస్తున్న సీఎం కేసీఆర్ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నిర్మల్ జిల్లా క‌లెక్ట‌ర్ వ‌రుణ్​రెడ్డి, సంబంధిత జిల్లా అధికారుల‌తో క‌లిసి.. నూతన సమీకృత కలెక్టరేట్‌ సముదాయం, కొత్తగా నిర్మించిన బీఆర్‌ఎస్‌ కార్యాలయాన్ని, బహిరంగ సభ నిర్వహించే స్థలాన్ని,హెలిప్యాడ్​ను పరిశీలించారు.

నిర్మ‌ల్ జిల్లా కేంద్రంలో లక్ష మందితో నిర్వహించే భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఎల్ల‌ప‌ల్లి గ్రామ శివారులోని క్ర‌ష‌ర్ రోడ్​లో అనువైన స్థలంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గత 9 సంవత్సరాలుగా ప్రజలకు అందిస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాల గురించి సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారని మంత్రి తెలిపారు.

Telangana Decade Celebrations : 'తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి'

ప్రజలకు సుపరిపాలన అందించేందుకు సీఎం కేసీఆర్ నూతన జిల్లాలు ఏర్పాటు చేసి.. ప్ర‌తీ జిల్లా కేంద్రంలో స‌మీకృత క‌లెక్ట‌రేట్ స‌ముదాయ భ‌వ‌నాలను నిర్మించార‌ని తెలిపారు. సీఎం కేసీఆర్ స‌భ‌కు ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున త‌ర‌లి రావాల‌ని విజ్ఞప్తి చేశారు. సభ ఏర్పాటుకు జూన్ 2 వ‌ర‌కు అన్ని ప‌నులు పూర్తి చేయాల‌ని, సభకు వచ్చే ప్రజలు, ప్రజా ప్రతినిధుల కోసం అవసరమైన మేర పార్కింగ్ ఏర్పాటు, ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం కాకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

"సీఎం కేసీఆర్​ జూన్​ 4న ఆదివారం నిర్మల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా సమీకృత కలెక్టరేట్ కార్యాలయం, బీఆర్​ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఆనంతరం లక్షమందిలో ఎల్లపల్లి శివారు క్రషర్​ రోడ్​ వద్ద బహిరంగ సభ జరగనుంది. ఈ సభలో గత 9 సంవత్సరాలుగా ప్రజలకు బీఆర్​ఎస్​ ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాల గురించి సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారు. ఈ సమీకృత కలెక్టరేట్​ కార్యాలయం అందుబాటులోకి వచ్చినట్లయితే.. జిల్లా అధికార యంత్రాంగమంతా అందుబాటులో ఉంటుంది. ప్రజలకు ఎమైనా సమస్యలు వచ్చి త్వరగా పరిష్కరమవుతాయి". - ఇంద్రకరణ్​రెడ్డి, దేవాదాయశాఖ మంత్రి

Telangana Green Festival : నిర్మల్​లో నెలకొల్పిన స్టెరిలైజేషన్ సెంటర్ తరహాలో దశల వారీగా అన్ని జిల్లాలకు విస్తరించాలని మంత్రి సూచించారు. అటవీ శాఖలో ఖాళీల భర్తీని టీఎస్​పీఎస్సీతో సంప్రదింపుల ద్వారా త్వరగా రిక్రూట్​మెంట్ జరిగేలా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. వీలున్న అన్ని ప్రాంతాల్లో బాధ్యతాయుతమైన ఎకో టూరిజాన్ని ప్రోత్సహించాలని మంత్రి అన్నారు. శాఖా పరంగా రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని, పదేళ్ల ప్రగతిని అన్ని వర్గాలకు వివరించాలన్నారు.

ఇవీ చదవండి:

Last Updated : May 28, 2023, 5:05 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.