ఆయుర్వేద వైద్యులకు శస్త్ర చికిత్సలు చేసేందుకు అవకాశం కల్పిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఐఎంఏ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు నిర్మల్ జిల్లా కేంద్రంలో మంగళవారం నిరసన ప్రదర్శన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు.
యునాని, ఆయుర్వేదం, హోమియోపతి లాంటి దేశీయ వైద్య చికిత్స విధానాలను పరిశోధనలతో అభివృద్ధి చేయాలని ఐఎంఏ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు అప్పాల చక్రదారి పేర్కొన్నారు. ఆయా వైద్య చికిత్స విధానాలు వేటికవే వైరుధ్యంతో కూడుకున్నవని తెలిపారు. అవేమీ పట్టించుకోకుండా అన్నింటినీ కలపటం వల్ల ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతుందన్నారు. కార్యక్రమంలో రామకృష్ణ, కృష్ణంరాజు, రమేశ్, మురళీధర్, కృష్ణమోహన్, రవికుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: కట్నం వేధింపుల కేసులో భర్త, అత్తకు ఏడేళ్ల జైలు శిక్ష