ETV Bharat / state

Huge Floods To Telangana Projects : తెలంగాణ ప్రాజెక్టులకు జలకళ.. గేట్లు ఎత్తి దిగువకు వరద నీరు విడుదల

Huge Floods To Telangana Projects : దాదాపు 45 రోజుల తర్వాత.. రాష్ట్రవ్యాప్తంగా వానలు మెండుగా పడుతున్నాయి. దీంతో గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రాజెక్టులు, హైదరాబాద్​లోని ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. దీంతో అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఏ ప్రాజెక్టుల్లో వరద నీటిని దిగువకు పంపిస్తున్నారో తెలుసుకొండి.

Telangana Projects Rainfall
Heavy Flood Water Reaching in Telangana Projects
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 6, 2023, 12:34 PM IST

Huge Floods To Telangana Projects : రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో గోదావరి పరివాహక ప్రాంతాల్లోని జలాశయాలు, హైదరాబాద్​ పరివాహక ప్రాంతాల్లోని జలాశయాలకు జలకళ సంతరించుకుంది. గత 45 రోజుల ముందు నాటి పరిస్థితులు ఆ జలాశయాల వద్ద కనిపిస్తున్నాయి. కొన్నింటి వద్ద పూర్తిస్థాయికి మించి నీరు ప్రాజెక్టుల్లో చేరడంతో.. వచ్చిన నీరును వచ్చినట్లు గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు.

Sriram Sagar Project Gates Opened : ఈ క్రమంలో నిజామాబాద్​ జిల్లాలోని శ్రీరామసాగర్​ ప్రాజెక్టు(Sriram Sagar Project)కు వరద కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 89వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరతుండగా.. 21 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువ ద్వారా 3000 క్యూసెక్కులు.. ఎస్కేప్​ గేట్ల ద్వారా 5000 క్యూసెక్కుల(Cusec) నీటిని బయటకు పంపించేస్తున్నారు. అయితే ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా.. ప్రస్తుతం పూర్తిగా నిండిపోయింది. శ్రీరామసాగర్​ ప్రాజెక్టు ప్రస్తుత, పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీ(TMC)లుగా ఉంది.

Telangana Heavy Rains Today : రాష్ట్రవ్యాప్తంగా దంచికొట్టిన వర్షం.. జలమయమయిన ప్రాంతాలు

Kadem Project Water Flow in Nirmal : ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు నిర్మల్​ జిల్లా కడెం ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి కొనసాగుతుంది. ఇప్పటికే నిండు కుండలా మారిన జలాశయం నుంచి రెండు గేట్లను ఎత్తి దిగువకు నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 696 అడుగులుగా ఉంది. ప్రాజెక్టులోకి 34400 క్యూసెక్కుల నీరు చేరుతుండగా.. దిగువకు 27224 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.

Swarna Project Overflow in Sarangapur : మరోవైపు సారంగాపూర్​ మండలంలోని స్వర్ణ ప్రాజెక్టులోకి 3000 క్యూసెక్కుల వరద నీరు చేరుతుండటంతో ఒక గేటును ఎత్తి దిగువకు నీటిని అధికారులు వదులుతున్నారు. ఈ ప్రాజెక్టు దిగువ ప్రాంతాన ఉన్న ప్రజలు, వాగు పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. స్వర్ణ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1183 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1182.9 అడుగులకు చేరుకుంది.

Heavy Rains in Hyderabad Today : భారీ వర్షానికి వణికిన భాగ్యనగరం.. మూసారంబాగ్‌ బ్రిడ్జి మూసివేత

Flood Flow to Twin Reservoirs in Hyderabad : మరోవైపు రాజధాని పరివాహక ప్రాంతంలో ఉన్న జలాశయాలు జలాలతో నిండుకుండలా మారిపోయాయి. హైదరాబాద్​లో ఉన్న జంట జలాశయాలకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. హిమాయత్​ సాగర్​లో ప్రస్తుత నీటి మట్టం 1763.50 అడుగుల వరకు నీరు చేరింది. ఎగువ నుంచి 4000 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి చేరుతోంది. దీంతో ఆరు గేట్లను ఎత్తి 4120 క్యూసెక్కుల నీటిని మూసీ నదిలోకి వదులుతున్నారు. ఇక ఉస్మాన్​ సాగర్​లోనూ ఆరుగేట్లను ఎత్తి ఎగువ నుంచి వస్తున్న 2200 క్యూసెక్కుల వరద నీటిలో 2028 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఇక ఉస్మాన్​ సాగర్​ ప్రస్తుత నీటి మట్టం 1790.90 అడుగులుగా ఉంది.

Sriram Sagar Project gates Opened : ఎస్సారెస్పీకి భారీ వరద.. 21 గేట్లు ఎత్తి నీటి విడుదల

Rain Effect in Hyderabad : దంచికొట్టిన వర్షం.. వణికిపోయిన భాగ్యనగరం.. జనజీవనం అస్తవ్యస్తం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.