నిర్మల్‌లోని హెడ్ క్వార్టర్స్‌లో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న శంకర్ గౌడ్.. ఉదయం తుపాకీని శుభ్రం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా పేలింది. తూటా శంకర్ గౌడ్ చంక భాగం నుంచి దూసుకెళ్లింది. వెంటనే అతడ్ని నిర్మల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఎస్పీ శశిధర్‌రాజు ఆసుపత్రికి చేరుకొని.. శంకర్‌గౌడ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. కానిస్టేబుల్ నిర్మల్ జిల్లా ఖానాపూర్‌కు చెందిన వ్యక్తి.
ఇవీ చూడండి: రాష్ట్రంలో ఈరోజు 206 మందికి కరోనా