నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పాఠశాల స్కావెంజర్, వాచ్మెన్ల సంఘం ఆధ్వర్యంలో పార్ట్ టైం కార్మికులు, వాచ్మెన్లు నిరసన తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న తమను విధుల్లోకి తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు.
ప్రతిరోజు పాఠశాలలో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విధులు నిర్వహిస్తున్న తమను ఇటీవల ప్రభుత్వం తొలగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమను విధుల్లోకి తీసుకుని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు సత్తన్న, తిరుపతి, లక్ష్మీ, సుమన్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలి'