గంగ పుత్రులపై రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని... గంగపుత్ర సంఘం నాయకుడు మేకల అశోక్ అన్నారు. ఆ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు.
హైదరాబాద్లో నిర్వహించిన ముదిరాజ్ ఆత్మగౌరవ సభలో గంగ పుత్రులను కించపరిచేలా మంత్రి మాట్లాడారని పేర్కొన్నారు. స్కిల్ టెస్టులు లేకుండా వారికి సభ్యత్వం కల్పిస్తామనడం ఓట్ల కోసమేనని మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: 'సభ్యత, సంస్కారం మరిచి మాట్లాడుతున్నారు.. సరికాదు'