నిర్మల్ జిల్లా కేంద్రంలో జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌ను ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయంలో అమరవీరులను స్మరించుకుంటూ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఎన్టీఆర్ మినీ స్టేడియం వరకు ఫ్రీడమ్ రన్ చేపట్టారు.
![ఫ్రీడమ్ రన్ ప్రారంభిస్తోన్న కలెక్టర్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-adb-31-24-freedomrun-av-ts10033_24032021105546_2403f_1616563546_1033.jpg)
స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌ను సగర్వంగా నిర్వహించుకుంటున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇంఛార్జీ డీఆర్వో రాఠోడ్ రమేశ్, మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ, జిల్లా అధికారులు సుధీర్, వెంకటేశ్వర్లు, రమేశ్‌కుమార్, శ్రీనివాస్ రెడ్డి, కిరణ్ కుమార్, జయవంత్ చౌహన్, వాలీబాల్, ఒలంపిక్ క్రీడల అసోసియేషన్ అధ్యక్షులు వెంకటేశ్వర్రావు, అయ్యన్నగారి భూమయ్య తదితరులు పాల్గొన్నారు.