ETV Bharat / state

Forest : దేవునిగూడెం అడవి.. అద్భుతమంటూ ఐరాస కితాబు - uno praised devunigudem forest

ఒకప్పుడు ఇది చిట్టడవి(Forest). కాలక్రమంలో ఆక్రమణలకు గురై ఆనవాళ్లు కోల్పోయింది. బంజరు భూమిగా మారింది. ఈ భూమిని అటవీ శాఖ స్వాధీనం చేసుకుంది. హరితహారంలో భాగంగా లక్ష మొక్కలు నాటింది. చంటిబిడ్డను సాకినట్లు.. వాటిని సంరక్షించింది. ఆరేళ్ల తర్వాత ఇప్పుడది ఒక అందమైన అడవి(Forest)గా మారింది. ఎటు చూసి పచ్చదనం పరిఢవిల్లేలా రూపుదిద్దుకుంది.

devuni-gudem-forest
దేవునిగూడెం అడవి
author img

By

Published : Jul 12, 2021, 7:41 AM IST

ఒకప్పుడు అది బంజరుభూమి. కానీ ఇప్పుడు.. పుడమి తల్లి పచ్చనిచీర కట్టుకున్నట్లు.. ఎటు చూసినా పచ్చదనమే. ఆ ప్రాంతంలో అడుగు పెడితే చాలు.. చెట్లు రారమ్మని పిలుస్తున్నట్టు అనిపిస్తుంది.

లక్ష మొక్కలు..

బంజరుభూమిగా మారిన ఆ ప్రాంతం.. ఇప్పుడు పచ్చదనంతో ప్రకృతి ప్రేమికులను పులకరించడానికి కారణం అటవీ శాఖ. దేవునిగూడెం ప్రాంతం ఒకప్పుడది అడవే. ఆక్రమణలపాలై ఆనవాళ్లు కోల్పోయి బంజరుభూమైంది. ఆక్రమణకు గురైన 160 ఎకరాల భూమిని పోలీసుశాఖ, ప్రజాప్రతినిధులు, గ్రామస్థుల సహకారంతో అటవీశాఖ స్వాధీనం చేసుకుంది. మొదటి విడత హరితహారంలో భాగంగా అక్కడ ‘ఒక రోజు లక్ష మొక్కల’ కార్యక్రమం చేపట్టారు. 2015 జులై 7న చేపట్టిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ పాల్గొని ఓ మొక్క నాటారు. మొక్కల్ని పెంచే పనుల్లో గ్రామస్థులను భాగస్వామ్యం చేశారు. దీంతో ఇప్పుడు అక్కడ సహజసిద్ధ అడవి రూపుదిద్దుకుంది.

పచ్చదనంలో అగ్రగామి..

హరితహారం కార్యక్రమంలో భాగంగా నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ అటవీ డివిజన్‌ దేవునిగూడెంలో 160 ఎకరాల్లో అభివృద్ధి చేసిన ఈ అడవి.. ఐరాస పర్యావరణ విభాగం ప్రశంసలు అందుకుంది. ‘పచ్చదనం పెంచడంలో భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రం ప్రపంచ అగ్రగామి (లీడర్‌)గా ఉంది. ఆక్రమణలకు గురైన 160 ఎకరాల భూమిని కృషితో దట్టమైన అడవిగా అభివృద్ధి చేసిన ఖానాపూర్‌ అటవీ అధికారుల బృందానికి అభినందనలు’ అంటూ ఐరాస పర్యావరణ విభాగం మాజీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌(ఈడీ) ఎరిక్‌ సొల్‌హెమ్‌ ట్వీట్‌ చేశారు.

  • Bravo Telengana!
    This Indian 🇮🇳 state is a world leader in treeplanting and greening of the land. Kudos to Team Khanapur for their dedication of 7 years to convert 160 acres of encroached land into a lush green forest in Nirmal.

    pic.twitter.com/esbLUBQFDl

    — Erik Solheim (@ErikSolheim) July 11, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఆరేళ్ల క్రితం బంజరు భూమి..

‘‘దట్టంగా పెరిగిన అడవిని వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రాఫర్లతో ఫొటోలు తీయించాం. 35 రకాల పక్షులు, చుక్కల దుప్పులు, నీల్గాయిలు, సాంబార్లు, అడవి పిల్లులు, కుందేళ్లు ఆవాసంగా మార్చుకున్నట్లు గుర్తించాం."

- ఖానాపూర్‌ ఎఫ్‌డీవో కోటేశ్వర్‌రావు

కేసీఆర్ హరితవనం

ఆయన తీయించిన వీడియోను రాష్ట్ర అటవీ అధికారులు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా.. ఐరాస పర్యావరణ విభాగం మాజీ ఈడీ ట్విటర్‌లో స్పందించారు. ఇటీవల ఆ అడవిని సందర్శించిన మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి, ఎమ్మెల్యే రేఖానాయక్‌లు.. ‘కేసీఆర్‌ హరితవనం’గా నామకరణం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.