నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని పర్డి(కె) గ్రామం నుంచి పర్డి(కె) తండాకు వెళ్లే మార్గంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లో మంటలు చెలరేగాయి.
అటుగా వెళ్తున్న ప్రజలు భయంతో పరుగులు తీశారు. వ్యవసాయ పనుల నిమిత్తం ఏర్పాటు చేసిన ఈ నియంత్రికలో సాంకేతిక లోపం వల్లే మంటలు వచ్చాయని విద్యుత్ సిబ్బంది తెలిపారు.
గతేడాది నుంచి ట్రాన్స్ఫార్మర్లో నియంత్రికలో సమస్యలు ఉన్నాయని... అధికారులకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు వాపోయారు. ఈ నియంత్రిక కింద 20 వరకు వ్యవసాయ బోరుబావులు ఉన్నాయని... అధికారులు త్వరగా స్పందించాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి: లాక్డౌన్ ఎఫెక్ట్: ఆలుమగల మధ్య కరోనా రగిల్చిన మంటలివి!