నిర్మల్ జిల్లా ముథోల్‌లోని గాంధీ చౌక్ వద్ద ఉన్న విద్యుత్ నియంత్రికలో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. స్థానికులు వెంటనే స్పందించి అధికారులకు సమాచారం అందించగా... విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఘటనా స్థలానికి చేరుకొనే సరికి మంటలు పెద్దఎత్తున ఎగిసిపడటం వల్ల ఆగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. ప్రమాద స్థలానికి చేరుకొని ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేశారు. నియంత్రికలో సాంకేతిక లోపం వల్లే మంటలు చెలరేగాయని అధికారులు వెల్లడించారు. ఎలాంటి నష్టం కలగకపోవటం వల్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీ చూడండి : కార్తీక శోభతో వెలుగులీనుతున్న భాగ్యనగరం