నిర్మల్ జిల్లా మామడ మండలం జగదాంబ తండాలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆడే కిషన్ ఇంట్లో అర్ధరాత్రి విద్యుదాఘాతంతో ఒక్కసారిగా నిప్పులు చెలరేగాయి. గమనించిన ఇంట్లోని వ్యక్తులు బయటకు పరుగులు తీశారు.
మంటలు ఎక్కువ కావడం వల్ల ఇంట్లో ఉన్న సిలిండర్ పేలింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగి... ఇల్లు మొత్తం ఖాళీ బూడిదైంది. అగ్నిమాపక సిబ్బంది వచ్చే లోపే ఇదంతా జరిగిపోయింది. భారీగా ఆస్తినష్టం జరిగినట్లు బాధితులు వాపోయారు.
ఇదీ చూడండి.. ఆసియా టీమ్ బ్యాడ్మింటన్‌లో భారత్కు కాంస్యం