ETV Bharat / state

'కనీసం పెట్టుబడి రావడం లేదు.. ప్రభుత్వం ఆదుకోవాలి' - తెలంగాణ వార్తలు

ముధోల్ నియోజకవర్గంలోని రైతులు టమాటాలను రోడ్డుపై పారబోసి నిరసన తెలిపారు. మార్కెట్​లో దళారులు కూరగాయలను తక్కువ ధరకు అడగుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ధరలు తగ్గిపోవడం వల్ల పెట్టుబడి కూడా రావడం లేదని వాపోయారు. మద్దతు ధర కల్పించాలని డిమాండ్​ చేశారు.

farmers-in-mudhol-constituency-protested-by-throwing-tomatoes-on-the-road
'కనీసం పెట్టుబడి రావడం లేదు.. ప్రభుత్వం ఆదుకోవాలి'
author img

By

Published : Feb 22, 2021, 12:13 PM IST

నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలోని రైతులు.. టమాటాలను రోడ్డుపై పారబోసి నిరసన తెలిపారు. వీరంతా ప్రతిరోజు ఉదయం భైంసా మార్కెట్​కు కూరగాయలను తరలిస్తారు. అయితే మార్కెట్​లోని దళారులు కూరగాయలను తక్కువ ధరకు అడగుతున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు. టమాటా, కొత్తిమీర, వంకాయ ధరలు తగ్గిపోవడం వల్ల పెట్టుబడి కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుల పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందని వాపోతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

"క్యారెట్​ను రూ.20కే అడుగుతున్నారు. మాకు కూలీల ఖర్చు కూడా వచ్చేలా లేదు. పత్తి పోయిందని కూరగాయలు పండిస్తే అది కూడా ధర పడిపోయింది. ఆటో కిరాయీ వెళ్లడం లేదు. దిక్కు తోచని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం స్పందించాలి. "

- రైతు

"కూలీల ఖర్చు పెరుగుతోంది. కూరగాయల ధర తగ్గుతోంది. ప్రభుత్వం ఆదుకోవాలి. భైంసాలో బీట్​ మార్కెట్​ ఏర్పాటు చేయాలి. రైతుకు టమాటాకు కేజీకి 2 రూపాయలు కూడా దక్కడం లేదు. టమాటా, క్యారెట్ 40 రూపాయల నుంచి 50 రూపాయల వరకు బయట ధర పలుకుతుంటే ఇక్కడేమో కిలోకు 2 నుంచి 4రూపాయల మాత్రమే రైతులకు దక్కుతుంది."

-బాధిత రైతు

'కనీసం పెట్టుబడి రావడం లేదు.. ప్రభుత్వం ఆదుకోవాలి'

ఇదీ చూడండి: రాష్ట్రంలో మరో 114 కరోనా కేసులు, ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.