నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని కుటుంబ సమేతంగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి దర్శించుకున్నారు. వారికి ఆలయ పూజారులు పూర్ణకుంభంతో సాదర స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్న వారు తన మనమరాలు శ్రేయకు అక్షరాభ్యాసం జరిపించారు.
అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కమిషనర్‌ను శాలువాతో సన్మానించి అమ్మవారి ప్రసాదాన్ని, చిత్ర పటాన్ని అందజేశారు.
ఇదీ చూడండి: చంద్ర ఘంట అలంకారంలో శ్రీశైలం శ్రీ భ్రమరాంబాదేవి