ETV Bharat / state

భారీ బందోబస్తుతో భైంసా దుర్గామాత శోభాయాత్ర

భైంసాలోని దుర్గామాత శోభాయాత్రకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పట్టణంలోని నిఘా కెమెరాలను పోలీస్ కంట్రోల్ రూంకు అనుసంధానించినట్లు డీఎస్పీ తెలిపారు. ప్రజలంతా పోలీసులకు సహకరించాలని కోరారు.

durghamatha shobayatra at bhaimsa in nirmal district
భారీ బందోబస్తుతో భైంసా దుర్గామాతా శోభాయాత్ర
author img

By

Published : Oct 26, 2020, 1:02 PM IST

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో దుర్గామాత శోభాయాత్రకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పట్టణ ప్రధాన రహదారులు, వీధుల్లోని మార్గాల్లో ప్రత్యేక పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశామని డీఎస్పీ తెలిపారు. పట్టణంలోని నిఘా కెమెరాలను స్థానిక పోలీస్ స్టేషన్​లోని కమాండ్ కంట్రోల్ రూంకు అనుసంధానించినట్లు తెలిపారు. వీటితో పాటు 10 వీడియో కెమెరాలతో మొబైల్ బృందాలు రికార్డింగ్ చేస్తాయని పేర్కొన్నారు.

పండుగ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించుకొని ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు. కరోనా వైరస్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇద్దరు ఎస్పీలు, ఇద్దరు డీఎస్పీలు, సీఐలు-5, ఎస్సైలు-15, దాదాపు 250 మంది పోలీసు సిబ్బంది పాల్గొననున్నారని వెల్లడించారు.

ఇదీ చదవండి: నిర్మల్​లో ఘనంగా దుర్గామాత నిమజ్జనం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.