నిర్మల్ జిల్లా కేంద్రంలో వాహన చోదకులు హెల్మెట్ ధరించడంపై పోలీసులు వినూత్న ప్రచారం చేశారు. కలెక్టర్ కార్యాలయం ముందు హెల్మెట్ ధరించిన వాహన చోదకులకు విద్యార్థులచే గులాబి, గ్రీటింగ్ కార్డ్ అందజేశారు. హెల్మెట్ ధరించని వారికి పుష్పాన్ని అందజేస్తూ హెల్మెట్ ధరించాలని సూచించారు.
ఆర్టీసీ బస్సు డ్రైవర్ సీటు బెల్ట్ ధరించి నడపడం వల్ల డ్రైవర్కు పుష్పాన్ని అందజేసి అభినందించారు. పుష్పాలను అందజేసిన పిల్లల్ని చూసి అయినా తమ పిల్లల్ని గుర్తు తెచ్చుకోవాలని వాహన చోదకులను కోరారు. రహదారి నిబంధనలు పాటించకుంటే జరిమానాలు విధించడం జరుగుతుందని ఎస్పీ శశిధర్ రాజు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఉపేందర్రెడ్డి, పట్టణ సీఐ జాన్ దివాకర్లు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : గుట్టుగా సాగుతున్న గంజాయి దందా