నిర్మల్ జిల్లా కేంద్రంలో హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. ఉదయం నుంచే యువతీ యువకులు, చిన్నారులు రంగుల పొట్లాలతో సంబురాలు చేసుకున్నారు. వీధుల్లో సంచరిస్తూ ఒకరిపై ఒకరు రంగునీళ్లు చల్లుకుంటూ కేరింతలు కొడుతూ ఆనందంగా గంతులు వేశారు.

హోలీ రంగుల కేళి అంటూ చిందులు వేశారు. డీజే పాటలతో నృత్యాలు చేశారు. చిన్న,పెద్దా తేడా లేకుండా రంగులు పూసుకుంటూ సంతోషంగా గడిపారు.


ఇదీ చూడండి : రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న హోలీ వేడుకలు